 
															గుసాని సమితిలో బీజేడీ నేతల పాదయాత్ర
పర్లాకిమిడి: జిల్లాలోని గుసాని సమితిలో బీజేడీ పార్టీ నాయకులు జనసంపర్క పాదయాత్రను బుధవారం జరిపారు. పాదయాత్ర తొలుత ఏడో మైలు జంక్షన్ నుంచి గుసాని బ్లాక్ బీజేడీ పార్టీ కార్యాలయం వరకూ సాగింది. పాదయాత్రలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బీజేడీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, పెద్ద కొత్తూరు పంచాయతీ నాయకులు ఎం.సూర్యనారాయణ, బిజేడీ ఛత్ర యువజన అధ్యక్షులు త్రిపాఠి, ఆర్‌ఎంసీఎస్ అధ్యక్షులు ఎస్.గజపతిరావు తదితరులు ఉన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర నవంబర్ తొమ్మిదో తేదీ వరకూ కొనసాగుతోందని బీజేడీ నాయకులు ప్రదీప్ నాయక్ తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమలు చేసిన అనేక పథకాలు ప్రతి ఇంటికి చేరాలని ప్రదీప్ నాయక్ అన్నారు.
 
							గుసాని సమితిలో బీజేడీ నేతల పాదయాత్ర

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
