సురక్షా పరికరాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

సురక్షా పరికరాల పంపిణీ

Oct 23 2025 6:29 AM | Updated on Oct 23 2025 6:29 AM

సురక్

సురక్షా పరికరాల పంపిణీ

జయపురం: జయపురం మున్సిపాలిటీ తరఫున పారిశుధ్య పనివారికి వ్యక్తగత రక్షణ, భద్రతకు ఉపయోగ పడే పరికరాలను బుధవారం అందజేశారు. ప్రభుత్వ గరిమ్‌ పథకంలో భాగంగా స్థానిక టౌన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ నరేంద్రకుమార్‌ మహంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహంతి మట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రతకు పారిశుద్ధ్య పనివారు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు. వారికి రక్షణ, భద్రత కల్పించటం మున్సిపాలిటీ బాధ్యత అన్నారు. మున్సిపాలిటీలో 200 మందికి సురక్షా పరికరాలు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్న జయపురం పబ్‌ కలెక్టర్‌ అక్కవరం శొశ్యా రెడ్డి, అదనపు కార్యనిర్వాహక అధికారి పూజ గదబ పాల్గొన్నారు.

సురక్షా పరికరాల పంపిణీ1
1/1

సురక్షా పరికరాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement