
చిలికా సరస్సులో చిక్కుకున్న పడవ
భువనేశ్వర్: యాంత్రిక లోపం కారణంగా పడవ చిలికా సరసులో మధ్యలో చిక్కుకుంది. ఈ పడవలో 40 మంది ప్రయాణికులతో పాటు 15 వాహనాలు ఉన్నాయి. జొహ్నికుదొ నుంచి సతొపొడా తీరానికి వెళుతుండగా మంహిషాకుద్దొ సమీపంలో గంటసేపు పడవ అకస్మాత్తుగా స్తంభించి పోయింది. నిస్సహాయ స్థితిలో ప్రయాణికులు బిక్కుబిక్కుమని గడిపారు. మార్గమధ్యంలో ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. పునరుద్ధరణకు సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఈ పరిస్థితి తాండవించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ప్రాణ హాని ఇతరేతర నష్టం సంభవించ లేదు. సహాయక బృందం ఘటనా స్థలానికి చేరి పడవలో చిక్కుకున్న వ్యక్తులతో సహా వాహనాల్ని సురక్షితంగా గమ్యం చేర్చింది. ఈ సంఘటనపై సర్వత్రా విచారం వ్యక్తం అవుతోంది. చిలికా సరసులో పడవ సేవల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ఆందోళనలను రేకెత్తించింది.