
నియమగిరిలో మావోల కోసం పోస్టర్లు
రాయగడ: నియమగిరి పర్వత ప్రాంతాల్లో మావోయిస్టుల బెడద నుంచి ప్రజల్ని విముక్తి కలిగించడంతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు ఒడిశా పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధిలో గల నియమగిరి పర్వత ప్రాంతాల్లో అదేవిధంగా మునిగుడ, చంద్రపూర్ సమితుల్లో గల వివిధ ప్రాంతాల్లో మావోయిస్టులను పట్టుకోండి.. అందుకు తగ్గ బహుమతులను పొందండి అన్న నినాదాలతో పోస్టర్లు అతికించారు. కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీ కార్యాలయం, అదేవిధంగా సమితి కార్యాలయాల్లో ఈ తరహా పోస్టర్లు దర్శనం ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లలో మావో కేంద్ర కమిటీకి చెందిన గణేష్ ఉయికే, స్వతంత్ర జోన్ కమిటీ సభ్యులు నిఖిల్ ఒరాఫ్ శివాజీ, సుదర్శన్ ఒరఫ్ వికాష్, అంకిత ఒరఫ్ ఇందు, శుక్ర ఒరప్ క్రిష్ణ, నితు, అన్వేష ఒరఫ్ రేణు, డివిజినల్ కమిటి సభ్యులు మమత ఒరఫ్ సాయితేజ్, నకుల్ ఒరప్ చంద్ర తదితర మావో నేతల ఫొటోలతో పాటు వారి పక్కనే ప్రకటించిన బహుమతి నగదును ముద్రించారు. ఎవరైనా వారి (మావో) వివరాలు కచ్చితంగా తెలియజేస్తే వారి వివరాలు పోలీసులు గోప్యంగా ఉంచుతుందని అదేవిధంగా పట్టిన మావొయిస్టుకు ప్రకటించిన బహుమతి నగదును అందజేస్తామని పొస్టర్లలొ ప్రచురించి ఏర్పటు చేయడం విశేషం. గత కొద్ది కాలంగా నియమగిరి పర్వత ప్రాంతాల్లొ మావొ కదలికలు ఎక్కువగా ఉండటంతొ వారిని అనిచివేసే ప్రక్రియలొ భాగంగా ఒడిశా ప్రభుత్వం ఈ మేరకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని ఆ ప్రాంత ప్రజలు గుసగుసలాడుకొవడం వినిపిస్తుంది.

నియమగిరిలో మావోల కోసం పోస్టర్లు