
మహిళా డిగ్రీ కళాశాలలో పోషణ వారోత్సవాలు
పర్లాకిమిడి: స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో పోషణ వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో కళాశాల విశ్రాంత అధ్యక్షులు డాక్టర్ భారతీ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గ్రామాల్లో నివసిస్తున్న కిశోర బాలికలు, గర్భిణులు పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పోషక ఆహారం అందిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో మహిళా కళాశాల అధ్యాపకులు డాక్టర్ కళ్యాణీ మిశ్రా పాల్గొన్నారు.
జోరుగా అభివృద్ధి పనులు
పర్లాకిమిడి: పట్టణంలోని రెండవ వార్డు శంకర్‌బాస్ చెరువు వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో పెద్ద కల్వర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. సుమారు రూ.7 కోట్లతో శంకర్‌బాస్ చెరువు, కాలవ గట్టు, డ్రైనేజీ కల్వర్టులు నిర్మిస్తున్నారు. దీంతో బస్టాండ్‌కు వెళ్లే వాహనాలను దారిమళ్లిస్తున్నారు. మరో పది రోజుల్లో కల్వర్టు పనులు పూర్తవుతాయని బరంపురం కంట్రాక్టరు తెలియజేశారు.
నాటు బాంబులు స్వాధీనం
భువనేశ్వర్: పూరీ పట్టణ ప్రాంతంలో అక్రమ బాణాల తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరు బస్తాల్లో నాటు బాంబులను స్వాధీనపరచుకున్నారు. ఈ ప్రాంగణంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలపై ఒకరిని అరెస్టు. సదర్ పోలీసులు పూరీ నరహరిపూర్‌లోని శ్రీకాంత్ మిశ్రా ఇంటిలో ఈ బాంబుల తయారీ కొనసాగుతున్నట్లు నిర్ధారించి అతన్ని అరెస్టు చేసినట్లు పూరీ సదరు ఠాణా పోలీసులు తెలిపారు.
రైల్వే స్టేషన్‌లో
గంజాయి పట్టివేత
జయపురం: జయపురం రైల్వే స్టేషన్‌లో జయపురం అబ్కారీ విభాగ సిబ్బంది ముగ్గురు వ్యక్తులను సోదా చేసి వారి బ్యాగ్‌లో ఆరు కిలోల గంజాయి పట్టుకున్నట్లు జయపురం అబ్కారీ విభాగ అధికారి శశికాంత దత్ వెల్లడించారు. అరెస్టయిన వారు కొట్‌పాడ్ సమితి కలియపొదర్ గ్రామం దీనబందు పెంటియ(25), కయగుడ ధవుడపల్లి మోచిరాం కుంభార్(25)రామనాథ్ కుంభార్(31)లు అని వెల్లడించారు. వారి నుంచి స్వాధీన పరచుకున్న గంజాయి విలువ రూ.60 వేలు ఉంటుందని అంచనా. ఆయన వివరణ ప్రకారం ఆదివారం ఉదయం అబ్కారీ అధికారి శశికాంత దత్, ఓఐసీ సుభ్రత్ కేశరి హిరన్, ఏఏస్‌ఐ బలరాం దాస్ అబ్కారి సిబ్బందితో పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఆ సమయంలో రైల్వే ప్లాట్ ఫారంపై ముగ్గురు వ్యక్తులు నించుని ఉన్నారు. సామలేశ్వరీ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం వారు వేచి చూస్తున్నారు. వారిపై అనుమానం వచ్చి అబ్కారీ సిబ్బంది బ్యాగ్‌లను తనిఖీచేయగా వాటిలో గంజాయి బయట పడింది. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రాంతంలో గంజాయి కొని ఇతర ప్రాంతాల్లో అమ్మేందుకు తీసుకు వెళ్తున్నట్లు అబకారి అధికారి వెల్లడించారు.

మహిళా డిగ్రీ కళాశాలలో పోషణ వారోత్సవాలు

మహిళా డిగ్రీ కళాశాలలో పోషణ వారోత్సవాలు