
ఐసీడీఎస్ భవనం ప్రారంభం
రాయగడ: గుణుపూర్‌లో కొత్తగా నిర్మించిన ఐసీడీఎస్ కార్యాలయ భవనాన్ని సబ్ కలెక్టర్ అభిషేక్ దుదూల్ అనిల్ మంగళవారం ప్రారంభించారు. సమగ్ర శిశు వికాసానికి ఎంతగానో దోహదపడుతున్న ఐసీడీఎస్ సంస్థలో ఉన్న కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల సద్వినియోగానికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా కోవిడ్ వంటి ఆపద కాలంలో వారు అందించిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి మీనతీ దేవ్, సీడీపీవో సుశుమా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
రాయగడ: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ అన్నారు. స్థానిక సమితి కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ స్థాయి పౌష్టికాహార మాసోత్సవాలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులకు సకాలంలో సమతుల్యమైన ఆహారాన్ని అందివ్వాలని సూచించారు. ప్రాజెక్టు అధికారి మీతారాణి దాస్ మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. అనంతరం పౌష్టికాహార వంటలను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో వంశధార నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై సబ్ కలెక్టర్ అభిషేక్ దుదూల్ అనిల్ కొరడా ఝులిపించారు. మంగళవారం ఆయన వంశధార నది వద్ద ఇసుక రీచ్‌లపై ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఆయన దాడులు నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 80పైగా ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అక్కడకు వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేశారు. అయితే ఇసుకను తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని గమనించిన 22 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.
చిత్రకొండ సమితిలో భారీ కలప పట్టివేత
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి గాజులమాముడి పంచాయతీ పరిధిలోని సింగారం అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి చిత్రకొండ అటవీ శాఖ రేంజర్ బలరామ్ నాయిక్ తన సిబ్బందితో కలపను పట్టుకున్నారు. ముంచిగ్‌పుట్ ప్రాంతానికి చెందిన సునధర్ ఖిలోను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు తుమ్మాలమమిడి గ్రామానికి చెందిన త్రినాథ్ హంతాల్‌గా తెలిపింది. ఆయన పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలంలో 119 కలప చెక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో టేకు ఎక్కువగా ఉందని రేంజర్ తెలిపారు.

ఐసీడీఎస్ భవనం ప్రారంభం

ఐసీడీఎస్ భవనం ప్రారంభం

ఐసీడీఎస్ భవనం ప్రారంభం