
తుపాకీ, పిస్టల్, 350 కిలోల గంజాయి
జయపురం: కొరాపుట్ జిల్లాలో నేరాలు నియంత్రిస్తున్నామని ఎస్పీ రోహిత్ బర్మ బుధవారం తెలిపారు. జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అపరాధి నిరోధక అభిజాన్‌లో జిల్లా పోలీసులు 350 కిలోల గంజాయితో పాటు తుపాకీ, ఒక పిస్టల్‌లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ నెలలో 17కుపైగా కేసుల్లో నిందితులతో పాటు ఒక హార్డ్‌కోర్ నిందితుడిపై నాసా చట్టంలో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌తో పాటు గంజాయి మాఫియా, హార్డ్‌కోర్ నేరస్తుడు లాల్ బహుదూర్ దర్జీని అరెస్టు చేశామని, అతడిపై గతంలో 20 కి పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతడి నుంచి ఒక తుపాకీ, ఒక పిస్టల్, 350 కేజీల గంజాయి పట్టుకున్నట్టు వెల్లడించారు. ఆయుధాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఒక పోలీసు టీమ్‌ను బీహార్‌కు పంపించినట్లు వెల్లడించారు. గతంలో ఒక బట్టీ ఆదాయ నేరస్తుల వ్యతిరేకంగా హెల్ప్‌లైన్ ప్రారంభించామని వెల్లడించారు. ఆ హెల్ప్‌లైన్ నంబర్ 94389 16918 జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్ కార్యాలయంలో ఉందని వెల్లడించారు. ఈ హెల్ప్‌లైన్‌ను సద్వినియోగం చేస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీప్ కశ్యప్, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్,పాడువ పోలీసు అధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు.

తుపాకీ, పిస్టల్, 350 కిలోల గంజాయి