
ఉత్సాహంగా జిల్లా స్థాయి శిశు మహోత్సవం
పర్లాకిమిడి:
వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు మన సంస్కృతి, ఆటలు, పాటలు మరిచిపోకుండా ఏటా నిర్వహిస్తున్న శిశు మహోత్సవాన్ని స్థానిక బిజూ కల్యాణ మండపంలో జిల్లా శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ శిశు మహోత్సవం మహాక్, ఉత్సాహ్ పేరిట నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఫాల్గుణీ మఝి విచ్చేసి ప్రారంభించగా, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్వినీ మహాపాత్రో, జిల్లా శిశు సంరక్షణ అఽధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ బాలాశ్రమాలు, అనాథాశ్రమంలో వుంటూ చదువుకుంటున్న విద్యార్థులు కూడా పలు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తంగా రోజంతా 22 పోటీలను నిర్వహించారు. విజేతలకు ఏడీఎం మఝి బహుమతులను అందజేశారు. వీరిని రాష్ట్రస్థాయికి పంపిస్తామని డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి తెలియజేశారు.

ఉత్సాహంగా జిల్లా స్థాయి శిశు మహోత్సవం