నందిగాం: మండల పరిధిలోని నర్సిపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వ్యాన్ ఢీకొనడంతో వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రా మానికి చెందిన పిట్ట చంద్రశేఖర్‌తో పాటు మరో 8 మంది టాటా మ్యాజిక్ వ్యాన్‌లో ఆదివారం ఉదయం ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో మజ్జిగౌరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరిగి గ్రామానికి వస్తుండగా ఆదివారం రాత్రి మండల పరిధిలోని నర్సిపురం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టారు. దీంతో వ్యాన్‌లో ఉన్న 9 మందికి చిన్న, చిన్న గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకొని క్షతగాత్రులను టెక్క లి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ ఇచ్చి న ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.