
ఉపాధ్యాయునిపై దాడి
రాయగడ: రాష్ట్రపతి అవార్డు గ్రహీత, బిలేసు ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ద్వితిచంద్ర సాహుపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సాహు తలకు తీవ్రగాయాలయ్యాయి. రాజధాని భువనేశ్వర్‌లోని రైల్వే పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు సమితి బిలేసు ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న సాహు విధుల్లో భాగంగా భువనేశ్వర్ వెళ్లాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం 6 వద్ద రైలు దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు మొబైల్ లాక్కొవడమే కాకుండా కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో సాహు తలపై తీవ్రగాయాలయ్యాయి. అక్కడి వారు కొందరు అతనిని కేపిటల్ హాస్పిటల్‌కు తరలించారు. దాడి చేసిన దుండగులు ఎవరు, ఎందుకు దాడి చేశాడు, మొబైల్ లాక్కొని పారిపోకుండా ఎందుకు కర్రతో దాడి చేశాడనే విషయం రాయగడలో చర్చనీయంశంగా మారింది. బాధితుడు సాహు భువనేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.