
తేనెటీగల దాడిలో తల్లీకూతుళ్లకు గాయాలు
రాయగడ: పొలం పనులు చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న తల్లీకుతూళ్లు తేనేటీగల దాడిలో గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని నారాయణపూర్ పంచాయతీ పరిధిలో గల పిందుగుడ గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. మంజులత హియల్(గర్భిణి), ఆమె మూడేళ్ల కూతురు సుశ్రీలు దొందులి కూడలి చేరేసరికి తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఇద్దరూ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పక్కనే పొలం పనులు చేసుకుంటున్న కొందరు రైతులు వీరిని చూశారు. అటుగా వస్తున్న వాహనంలో కళ్యాణసింగుపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తేనేటీగల ముళ్లును వైద్యులు తీశారు. పరిస్థితి కుదుటగా ఉండటంతో చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.
రాయగడ: ఛత్తీష్‌గఢ్ జిల్లా రాయిపూర్ నుంచి విజయవాడకు బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ మంటల్లో చిక్కుకుంది. స్థానిక లడ్డ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాగన్‌లో మంటల వ్యాపించడంతో గూడ్స్ సిబ్బంది వెంటనే రైలును నిలిపి అధికారులకు సమాచారం అందించా రు. రాయగడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
పర్లాకిమిడి: పట్టణంలో మూడు రోడ్ల జంక్షన్ లో పాత ఫైర్ స్టేషన్ వద్ద సీసీ రోడ్డులో భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ము ఖ్యంగా రాత్రిపూట వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి గొయ్యిని పూడ్చాలని పలువురు కోరుతున్నారు.
రాయగడ: దేశ ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బీజేపీ శ్రేణులు బస్టాండును శుభ్రపరిచారు. స్వచ్ఛ ఉత్సవ్ సందర్భంగా బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు బసంత కుమార్ ఉలక, పద్మనాభ దాస్, మంజులా మినియాక పాల్గొన్నారు.
పీహెచ్‌సీ ముందు గిరిజన మహిళల ధర్నా
పాతపట్నం: మండలంలోని బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) ముందు వైద్యం అందడం లేదని గిరిజన మహిళలు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. బుధవారం ఉదయం ఆర్.ఎల్.పురం,పెద్ద సున్నాపురం, రామన్నగూడ తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళలు పీహెచ్‌సీకి చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని తమకు డాక్టర్ వద్దని ఆందోళన చేపట్టారు. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. వేరే ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే డాక్టర్‌ను నియమించి తమకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వీధి కుక్కల దాడిలో
నలుగురికి గాయాలు
మందస: మండల కేంద్రంలో వీధి కుక్కల దాడిలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. బుధవారం గుంపుగా వెళ్లి దాడిచేసి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులకు కాటు వేశాయి. దీంతో వీరికి మందస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తేనెటీగల దాడిలో తల్లీకూతుళ్లకు గాయాలు

తేనెటీగల దాడిలో తల్లీకూతుళ్లకు గాయాలు

తేనెటీగల దాడిలో తల్లీకూతుళ్లకు గాయాలు