
లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
జయపురం: జయపురం లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షునిగా సూర్యప్రకాశ్ రావు, కార్యదర్శిగా ఎమ్.కె.దాస్‌లు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అలాగే మిగతా పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం రాత్రి వెలువరించిన ఫలితాలలో ఉపాధ్యక్షులుగా జి.రమేష్ కుమార్, సహాయ కార్యదర్శిగా ఎస్.సతీష్,కేషియర్‌గా ఎస్.రామకృష్ణ లు విజయ సాధించినట్లు నూతన కార్యదర్శి ఎన్.కె.దాస్ నేడు పత్రికల వారికి తెలిపారు. సోమవారం స్థానిక 26 వ జాతీయ రహదారిలోగల లారీ ఓనర్స్ అషోషియేషన్ సొంత కార్యాలయంలో ప్రమాణ శ్వీకారం జరిగింది.భగవత్‌గీతపై ప్రమాణం చేస్తూ జరిగిన ప్రమాణ శ్వీకార ఉత్సవం కార్యక్రమంలో కొత్తగాఎన్నికై న అద్యక్షులు సూర్యప్రకాశ్ రావు, కార్యదర్శి ఎమ్.కె దాస్ లతో పాటు నూతన కార్యకర్తలు ప్రమాణ శ్వీకారం చేసారు.ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీదాస్ మాట్లాడుతూ సుధీర్ఘ 22 యేళ్లు తరువాత తిరిగి తనను లారీ ఓనర్సు అసోసియేషన్ కార్యదర్శిగా ఏక గ్రీవంగా సభ్యులు ఎన్నుకొనటం తనకెంతో ఆనందంగా గర్వంగా ఉందన్నారు.అషోషియేషన్‌ను మరింతగా బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని సభ్యులను హామీ ఇచ్చారు.పట్టణంలో 250 కిపైగా లారీలు ఉన్నాయని 147 మందికిపైగా లారీ యజమానులు ఉన్నారని వారందరినీ ఏకత్రాటిపై నడిపి వారి ప్రయోజనాలకు,లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం అభివృద్దికి తాను కృషి చేస్తానని వెల్లడించారు.పట్టణంలో బియ్యం మిల్లులు, కాజూ ప్యాక్టరీలు మొదలగునవి ఉన్నాయని ఆయామిల్లులు, ప్యాక్టరీల యజమానులతో మంచి సంబందాలు నెలకొల్పి ట్రాన్స్‌పోర్టు వ్యాపారాన్ని పెంచేందుకు కృషి చేస్తామని అవసరం అయితే మినీ ట్రక్కులను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తామని కార్యదర్శి ఎమ్.కె.దాస్ వెల్లడించారు.

లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం