
హోటల్‌పై దుండగుల దాడి
జయపురం: జయపురం సదర్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో కొంత మంది దుండగులు హోటల్‌పై దాడి చేసి యజమానిని, పనివారిని కొట్టి సరుకులను ధ్వంసం చేశారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస పాత్రో రౌత్ మంగళవారం తెలిపారు. హోటల్ యజమాని వాల్మీకి మహాపాత్రో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన కొంతమంది దుండగులు హోటల్‌కు వచ్చి రూ.5 వేలు అడిగారని, డబ్బులు ఇవ్వకపోతే హోటల్ మూసివేయాలని హెచ్చరించారు. దుండగులను యజమాని, హోటల్ పనివారు ఎదిరించటంతో వారిపై మారణాయుధాలతో కొట్టారు. సమగ్రిని ధ్వంసం చేశారు. మహాపాత్రో మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచుకుపోయారు. దుండగులను పట్టుకుంటామని పోలీసు అధికారి వెల్లడించారు.
ట్యాంకర్‌ను ఢీకొన్న అమొ బస్సు
భువనేశ్వర్: ఖుర్ధా జిల్లా 16వ నంబరు జాతీయ రహదారిపై అమొ బస్సు ప్రమాదానికి గురైంది. టంగి ప్రాంతం ఛొటిలో గొడొ కూడలి సమీపంలో మంగళవారం ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు గాయ పడ్డారు. వారిలో 15 మంది గాయపడ్డారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో సత్వర ఉన్నత చికిత్స కోసం కటక్ ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. టంగి ఠాణాలో పోలీసులు ఘటనా స్థలం చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.