
ముగిసిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌మీట్
రాజాం: స్థానిక జీఎంఆర్ వరలక్ష్మి డీఏవీ స్కూల్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. జీఎంఆర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జె.గిరీష్, సీఏఓ సుప్రియోభట్టాచార్య తదితరులు ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి 22 డీఏవీ పాఠశాలలకు చెందిన 561 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వారిలో విజేతలకు పాఠశాల ఆవరణలో జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జీఎంఆర్‌ఐటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ డీన్ రాంబాబు, జీసీఎస్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. పురుషోత్తమరావు, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.