
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
మల్కన్‌గిరి: మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి అన్నారు. మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా చైతన్య రథాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చైతన్య రథం ద్వారా సమితుల్లో ఉన్న 111 పంచాయతీల్లో ఈ నెల పదో తేదీలోగా మొత్తం రెండు లక్షలు మొక్కలు నాటాలని కోరారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 17వ తేదీన అమ్మకోసం ఒక చెట్టు కార్యక్రమాన్ని నిర్వహించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాణ్, జిల్లా అటవీశాఖ అధికారి డి.ఎన్.కిరణ్‌కుమార్, జిల్లా సబ్ కలెక్టర్ ఎ.ఎల్.అశ్ని, జిల్లా ఎస్పీ వినోద్ పాటేల్ పాల్గొన్నారు.

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ