
పాముకాటుతో బాలిక మృతి
మల్కన్‌గిరి: పాముకాటుతో బాలిక మృతి చెందింది. మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి రోడన్‌పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. బాలక భీమే సోడి (6) ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలో మీర సోడి కుటుంబం నివసిస్తోంది. మంగళవారం రాత్రి భోజనాలు చేసిన తరువాత తల్లిదండ్రులతో కలిసి భీమే సోడి నిద్రపోయింది. అయితే విషసర్పం బాలిక కాలిపై కాటు వేసింది. దీంతో చిన్నారి కేకలు వేసి నిద్రపోయింది. బుధవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలోభీమే సోడి నోటివెంట చొంగ రావడంతోపాటు శరీరం అయిపోయినట్టు గమనించి తల్లి కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వెంటనే బాలికలను పోడియ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక చనిపోయినట్టు నిర్ధారించారు. పోడియ ఏఎస్సై అనిల్ మిశ్రో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలింంచారు.