
వైభవంగా వినాయక కల్యాణోత్సవం
రాయగడ: వినాయక ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఎద్దు వీధిలో బుధవారం వినాయక కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత వినాయకున్ని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముత్తయిదువులకు అక్షింతలు అందించారు. బ్రహ్మాది రుషులు మునులు దంపతులను ఆశీర్వదించేలా ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఏడో తేదీన మజ్జిగౌరి
మందిరం మూసివేత
రాయగడ: చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల ఏడో తేదీన మజ్జిగౌరి మందిరాన్ని మూసి వేస్తున్నట్లు మందిర కమిటీ బుధవారం ఓ ప్రకటలో తెలియజేసింది. ఆ రోజున ఉదయం 11 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శన భాగ్యం ఉంటుందని.. అనంతరం మందిరాన్ని మూసివేస్తామన్నారు. తిరిగి సొమవారం తెల్లవారుజామున తెరుస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో బుధవారం పార్శ్వ ఏకాదశి పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున మన ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయని.. అందుకే ఈ ఏకాదశిని పార్శ్వ ఏకాదశి లేదా పరివర్తన ఏకాదశిగా పిలుస్తారని ఆచార్యులు భక్తులకు వివరించారు.
పాఠశాల గోడను ఢీకొట్టిన వ్యాన్
● డ్రైవర్‌కు గాయాలు
రాయగడ: స్థానిక గోవిందచంద్ర దేవ్ ఉన్నత పాఠశాల గోడను ఒక వ్యాన్ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతొ వ్యాన్ ఒక వైపు పూర్తిగా ఒరిగిపోయింది. బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనలో డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఫ్‌లైఓవర్ బ్రిడ్జి మీదుగా వచ్చిన వ్యాన్ పాత బస్టాండు వైపు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
రాయగడ: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి రైల్వే స్టేషన్‌లోని మూడో నంబర్ ప్లాట్‌ఫారం వద్ద బుధవారం తెల్లవారున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడుకి 55 ఏళ్ల వయసు ఉంటుందని.. అతని వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇది ప్రమాదవశాత్తు జరగిన ఘటనా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలొ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వైభవంగా వినాయక కల్యాణోత్సవం

వైభవంగా వినాయక కల్యాణోత్సవం

వైభవంగా వినాయక కల్యాణోత్సవం