
శ్రీమందిరం పతాకంపై వాలిన డేగ..!
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం శిఖరాన నీలచక్రానికి అమర్చిన పతిత పావన పతాకంపై వాలిన డేగ కొద్ది సమయం నిలకడగా ఉండడం చర్చనీయాంశమైంది. ఇదో అసాధారణ ఘటనగా భక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇటువంటి దృశ్యం వీడియో వైరల్ అయి కలకలం రేపింది.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..
శ్రీ జగన్నాథుని ఆలయ శిఖరంపై శ్రీమహా విష్ణువు వాహనం డేగ వాలడం రక్షణతో కూడిన హెచ్చరికగా పరిగణించాలని ఆధ్యాత్మిక వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచానికి ఎదురు కానున్న సవాళ్ల గురించి ఇది ముందస్తు హెచ్చరిక. అలాగే దైవిక సంరక్షకత్వం ఉందని కూడా భరోసా ఇస్తుందని వివరించారు. జగన్నాథ ఆలయ శిఖరంపై డేగ ఉనికి అశుభం కాదు. అప్రమత్తంగా ఉండటం, భగవంతుని పట్ల విశ్వాసంతో లోతుగా ప్రార్థించడం, జగన్నాథుడు పర్యవేక్షిస్తూ రక్షిస్తున్నాడని విశ్వసించేందుకు సానుకూల శకునంగా కొంతమంది పేర్కొన్నారు.