
ఆదాయ పన్ను సరళీకరణతో మేలు
రాయగడ: ఆదాయపు పన్ను 1961 చట్టం సరళీకరణ చేయడంతో సీనియన్ సిటిజన్లకు ఎంతగానో మేలు చేకూరుతుందని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బరాటం రాంప్రసాద్ అన్నారు. స్థానిక ఆదాయపుపన్ను కార్యాలయంలో బుధవారం ‘ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు’ అనే అంశం సంబంధిత శాఖాధికారి టి.గంగరాజు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఆర్ సమర్పించేందుకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈక్విటీ పెట్టుబడులు, దీర్ఘకాలిక లాభాలు, మూలధన పొదుపుపై పన్ను స్లాబ్‌లను వివరించారు. అధిక ఆదాయం సంపాదిస్తున్న వారు సకాలంలో పన్నులు చెల్లిస్తే దేశ ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బరంపురం ఆదాయపు పన్ను విభాగం అధికారి రూపేష్ కుమార్ దాస్ తదితరులు పాల్గొన్నారు.