
రామనగుడలో కలెక్టర్ పర్యటన
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి రామనగుడలో బుధవారం పర్యటించారు. సమితి పరిధిలో గల వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఇందులో భాగంగా సమితి పరిధిలోని కొరడ గ్రామంలో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న చింతపండు ప్రక్రియకరణ కేంద్రాన్ని పరిశీలించారు. వారితో కాసేపు మాట్లాడారు. దీని ద్వారా వారు పొందుతున్న లాభాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖంబాగుడలో పర్యటించిన ఆయన స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు సాగు చేస్తున్న గులాబీ తోటలను పరిశీలించారు. మహిళల ఆర్థిక సార్ధికారతకు తోడ్పడుతున్న వీటిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రామనగుడలో ఈ– లైబ్రరీ, గొసాయి గులుముండలో ఇండ్రస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. కుజేంద్రి గ్రామీణ పార్క్‌లో కాసేపు గడిపి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమాడింగొలో నిర్మితమవుతున్న వంతెనను పరిశీలించారు. పనులపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. రామనగుడ బీడీఓ ప్రద్యుమ్న కుమార్ మండ్, తహసీల్దార్ ప్రాణకృష్ణ పాణిగ్రహి, సమితి అధ్యక్షుడు రవినారాయణ గొమాంగొ, తదితరులు పాల్గొన్నారు.