
ఆహార కమిషన్ సభ్యుల పర్యటన
పర్లాకిమిడి: ఒడిశా ప్రభుత్వ ఆహార కమిషన్ సభ్యులు జిల్లాలోని గుమ్మ, మోహనా సమితి కేంద్రాల్లోని పలు గ్రామాల్లో ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను బుధవారం సందర్శించారు. ఈ ఆహార కమిషన్ బృందంలో సభ్యులుగా ప్రియబ్రత సామంతరే, అక్షయ కుమార్ బెహరా, దయానిధి దాస్ ఉన్నారు. వీరు గుమ్మాలో అంగన్‌వాడీ కేంద్రం, ఆశ్రమ పాఠశాల, బరుంసింగిలో అంగన్‌వాడీ, భుబునీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెరంగోలో పుట్టగోడుగుల తయారీ కేంద్రాన్ని పరిశీలించకారు. జాతీయ ఆహార భద్రత, రాష్ట్ర ఆహార భద్రత పథకంలో ఎస్సీ, ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో మధ్యా హ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఆహార భద్రత పథకం కింద ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మిడ్ డే మీల్ అందించటంలో అధికారులు ముందుండాలని సూచించారు. ఈ బృందం పర్యటనలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని మనోరమా దేవి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బిష్ణుచరణ్ పరిడా, అదనపు సీఎస్‌ఓ సుమాన్ భోంయి, సవ్యసాచి బోస్తియా, గుమ్మా సమితి చైర్మన్ సునేమీ మండల్, బ్లాక్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.