
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
గార : రామచంద్రాపురం పరిధిలోని నవజ్యోతి, దుర్గా ఎంటర్‌ప్రైజెస్ ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. దుర్గా షాపు లైసెన్సు రెన్యువల్ ఇంకా జరగకపోవడాన్ని గుర్తించారు. నిల్వ ఉన్న 5.50 మెట్రిక్ టన్నుల డీఏపీ, ఎంవోపీ, సాయిల్ కండీషనర్ ఎరువుల అమ్మకాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా విజిలెన్సు సీఐ డి.వి.వి.సతీష్‌కుమార్, వ్యవసాయాధికారి డి.పద్మావతిలు మాట్లాడుతూ ఎరువులు అధిక ధరలకు అమ్మినా, అదనపు ఎరువులతో లింక్‌పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు.