భక్తిశ్రద్ధలతో పూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో పూజలు

Sep 3 2025 4:25 AM | Updated on Sep 3 2025 4:25 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో పూజలు

రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం రోజున నువాఖాయి సందర్భంగా విశేష పూజలను నిర్వహించారు. ఆలయ పూజారి తరణి బెరుకో ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజలు సందర్భంగా గంట సమయం వరకు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. ప్రతీ ఏడాది నువాఖాయి సందర్భంగా అమ్మవారికి ఈ పూజలను నిర్వహిస్తామని పూజారి తెలిపారు. కొత్తగా పండించిన ధాన్యం పాయసం, అదేవిధంగా కొత్తగా పండిన కూరగాయలను అమ్మవారి చెంత ఉంచి పూజలను నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదంతో పంటలు సంమృద్ధిగా పండాలని, అదేవిధంగా అంతా సుభిక్షంగా ఉండాలని ఈ పూజలను నిర్వహిస్తారని ప్రతీతి.

భక్తిశ్రద్ధలతో పూజలు 1
1/1

భక్తిశ్రద్ధలతో పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement