
ఎరువుల కోసం కదంతొక్కిన రైతులు
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి ల్యాంప్ కార్యాలయం వద్ద ఎరువుల కోసం రైతులు కదం తొక్కారు. మోటు, పుసుగూడ కలిమెల గ్రామాలకు చెందిన 800 మంది రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కారు. ఒక లారీ ద్వారా 65 బస్తాల ఎరువులు వస్తే, వేలాడి మంది రైతులకు ఎలా సర్దుబాటు చేస్తారని మండిపడ్డారు.
రైతుల ఆందోళనతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మల్కన్‌గిరి కలిమెల, మోటు రహదారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.