
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
పర్లాకిమిడి: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని జిల్లా అటవీశాఖ అధికారి కె.నాగరాజు అన్నారు. గుమ్మా బ్లాక్ జామి గ్రామంలో మొక్కలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజపతి జిల్లాలోని ఏడు సమితి కేంద్రాలు, 149 గ్రామ పంచాయతీల్లో ఈనెల 17న ‘సింగిల్ డే మాస్ ప్లాంటేషన్ డ్రైవ్’ను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏక్ పేడ్ మా కే నామ్ 2.0ను జిల్లాలో ఏడు ఫారెస్టు రేంజ్ ఆధీనంలో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేక సమితిల్లో సర్పంచ్‌లు, బీడీవోలు, సమితి సభ్యులు పాల్గొంటారన్నారు.

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ