
ఘాట్ రోడ్డులో భారీ వాహనం బోల్తా
రాయగడ: సదరు సమితికి సమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్మ ఘాటి మలుపులో మంగళవారం వేకువజామున కొరాపుట్ నుంచి వస్తున్న ఒక భారీ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న కుంభికోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో రాయగడ నుంచి కొరాపుట్ అటు కాసీపూర్, టికిరి ప్రాంతాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రాయగడ మీదుగా కొరాపుట్, నారాయణపట్నం వెళ్లే బస్సులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ఫలితంగా ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరణ చేపట్టారు.

ఘాట్ రోడ్డులో భారీ వాహనం బోల్తా