
సకాలంలో స్పందించిన 108 సిబ్బంది
● తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని సీహెచ్‌సీకి తరలింపు
● తప్పిన ప్రాణాపాయం
తెర్లాం: 108 వాహన సిబ్బంది సకాలంలో స్పందించి ఆస్పత్రికి తీసుకువెళ్లి ఓ వ్యక్తిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలంలోని చుక్కవలస గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ దత్తి వాసు వ్యక్తి సోమవారం ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కి పనిచేస్తుండగా షాక్‌కు గురై కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు తెర్లాం 108 వాహనానికి సమాచారం అందించారు. 108 వాహన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బోను వెంకటరమణ, పైలట్ పుప్పాల గౌరీశంకర్‌లు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల కోసం రాజాం సీహెచ్‌సీకి తరలించారు. విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయ స్థితి తప్పిందని వైద్యులు 108 వాహన సిబ్బందిని మెచ్చుకున్నారు. గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ను వ్యక్తిని కాపాడిన 108 వాహన టెక్నీషియన్, పైలట్‌ను కుటుంబ సభ్యులు, చుక్కవలస గ్రామస్తులు అభినందించారు.