
వినతుల వెల్లువ
పర్లాకిమిడి:
గజపతి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్, గ్రామ ముఖిపరిపాలనకు అధిక స్పందన లభించింది. కలెక్టర్ మధుమిత, ఎస్పీ జ్యోతింద్రకుమార్ పండా, జిల్లా పరిషత్ సీడీఎం శంకర కెరకెటా, జిల్లా అటవీశాఖ అధికారి కె.నాగరాజు వినతులు స్వీకరించారు. మొత్తంగా 75 వినతులు అందాయి. వాటిలో రెండింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. వ్యక్తిగతం 58, గ్రామ సమస్యలకు సంబంధించినవి 17 వినతులు వచ్చాయి. ముగ్గురు నిస్సహాయులుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.70 వేల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. సీడీఎంఓ డాక్టర్ ఎం.ఎం.ఆలీ, సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని బీడీఓ గౌరచంద్ర పట్నా యక్, తదతరులు పాల్గొన్నారు.
వినతుల స్వీకరణ..
రాయగడ: స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి వినుత ల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 77వినతులు వచ్చాయి. ఇందులో 69 వ్యక్తిగతం, 8 గ్రామ సమస్యలుగా గుర్తించారు.
ఆరుగురికి రూ.70 వేల సహాయం..
వినతుల స్వీకరణలో భాగంగా ఆరుగురుకి కలెక్టర్ వైద్య ఖర్చుల నిమిత్తం రెడ్ క్రాస్ నిధుల నుంచి రూ.70 వేలను మంజూరు చేశారు. వారి ఆర్థిక పరి స్థితుల దృష్ట్యా సీడీఎంఓ సిఫారసు మేరకు ఆర్థిక సహాయాన్ని అందించారు.
మౌలిక సౌకర్యాలు కల్పించండి..
రాయగడలోని సాయిప్రియ నగర్‌లో గల పలు వీధుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆ ప్రాంత వాసులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొత్తగా ఏర్పాటైన ఈ ప్రాంతం గత పదేళ్లలో ఎంతొ అభివృద్ధి చెందిందన్నారు. ఇటు పంచాయతీ పరిధిలోకి చెందక, అటు మున్సిపాలిటీ పరిధిలోని లేక అభివృద్ధికి దూరం ఉందన్నారు. గతకొద్ది ఏళ్లుగా సాయిప్రియ నగర్‌లో దొంగతనాలు అధికమయ్యాయన్నా రు. భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీస్ అవుట్ పో స్టును ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే మున్పిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్‌కుమార్‌తో చర్చించారు. సమస్య లపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించా రు. సమస్యలను సంబంధితశాఖ అధికారులు పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డీఎఫ్‌ఓ అన్నా సాహేబ్, సబ్ కలెక్టర్ రమేష్ చంద్ర జెన్నా, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయకుమార్ ఖెముండొ, వివిధ శాఖల కు చెందిన అధికారులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌సెల్‌కు 45 వినతులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మద్మాగిరి పంచాయతీలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను అధికారులు నిర్వ హించారు. కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ హాజర య్యారు. ఈ సందర్భంగా 45 వినతులు స్వీకరించా రు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని వివిధశాఖల అధికారుల ను ఆదేశించారు. జిల్లాలో రైతులకు యురియా సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. జిల్లా ఎస్పీ వినోద్ పాటేల్, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ కుమార్ సభరో పాల్గొన్నారు.

వినతుల వెల్లువ