నేటి నుంచి జాతీయ ఆహార భద్రతా కమిషన్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జాతీయ ఆహార భద్రతా కమిషన్‌ పర్యటన

Sep 2 2025 7:38 AM | Updated on Sep 2 2025 7:38 AM

నేటి

నేటి నుంచి జాతీయ ఆహార భద్రతా కమిషన్‌ పర్యటన

నేటి నుంచి జాతీయ ఆహార భద్రతా కమిషన్‌ పర్యటన ప్రాథమిక చికిత్సపై శిక్షణ సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం

పర్లాకిమిడి: గజపతి జిల్లాకు ఒడిశా రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు (భువనేశ్వర్‌) మంగళవారం నుంచి వరుసగా మూడు రోజులు గుమ్మా, మోహనా, గుసాని సమితుల్లో పర్యటించనున్నారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద బి.పి.ఎల్‌, దిగువ తరగతి ప్రజలకు రేషన్‌ సక్రమంగా అందుతున్నది, లేనిదీ తనిఖీలు చేయనున్నారు. ఈ ఫుడ్‌ కమిషన్‌లో సభ్యులుగా ప్రియబ్రత సామంతరే, అక్షయ కుమార్‌ బెహ రా, దయానిధి దాస్‌ ఉన్నారు. 2వ తేదీ ఉద యం గుమ్మా బ్లాక్‌ రోడ్‌ ప్రయాణంలో ఐ.సి.డి.ఎస్‌ ఆధీనంలో ఉన్న మధ్యాహ్నన భోజన పథకం, ట్రైబల్‌ పి.డి.ఎస్‌, ఎస్‌.ఎన్‌.పిలు, షెడ్యూ ల్డు కులాల ఆశ్రమ పాఠశాలలు, సేవాశ్రమాల ను తనిఖీ చేపట్టనున్నారు. మధ్యాహ్నం గుమ్మాబ్లాక్‌ అధికారులతో సమావేశం అవుతా రు. 3న ఉదయం 9 గంటలకు జిల్లాలో మోహ నా బ్లాక్‌, మధ్యాహ్నం 3 గంటలకు గుసాని సమితిలో పలు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేపట్టానున్నా రు. 4న జిల్లా కలెక్టరేట్‌లో పాలనాఽధికారి, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష చేపట్టనున్నారని జిల్లా కలెక్టర్‌ మధుమిత తెలియజేశారు.

రాయగడ: ప్రాథమిక చికిత్సపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సమాజ సేవకుడు, విశ్రాంత హోమియో వైద్యుడు లక్ష్మీనారాయణ సాహు అన్నారు. స్థానిక లయన్స్‌ క్లబ్‌ సమావేశం హాల్‌లో సొమవారం లేడీస్‌ క్లబ్‌ ద్వారా నిర్వహించిన ప్రాథమిక చికిత్స శిక్ష ణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా డాక్టర్‌ సాహు మాట్లాడుతూ.. గుండెపోటు వంటి ప్రమాదకర పరిస్థితు లు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలను వివరించారు. సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. పాము, కుక్క కాట్లకు గురైనప్పుడు ఎలా స్పందించాలి, ఎటువంటి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి, ఎటువంటి ప్రాథమిక చికిత్స చేపట్టాలో అవగాహన కల్పించారు. క్లబ్‌ అధ్యక్షురాలు కస్తూరి సాహు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సాహుని సత్కరించారు.

శ్రీకాకుళం క్రైమ్‌: పెళ్లికి యువతి నిరాకరించిందనే కారణంతో ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం వేకువజామున 3.30 గంట ల సమయంలో శ్రీకాకుళం నగరంలోని పాత దీప మహాల్‌ సమీప టవర్‌ మీదకు ఒక యువ కుడు అవలీలగా ఎక్కాడు. ఉదయమయ్యేసరి కి అటుగా వెళ్లే ప్రజలు గమనించారు. ల్యాప్‌టాప్‌ పట్టుకుని సిగ్నల్స్‌ దొరకక అక్కడ కూర్చు ని ఉన్నాడని అనుకున్నారు. అయితే ఎంతకీ దిగకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటాడేమోనన్న ఆందోళనతో ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణకు సమాచారమిచ్చారు. సరిగ్గా ఉదయం 8 గంటలకు అగ్నిమాపక కార్యాలయానికి కూడా కాల్‌ వెళ్లింది. అంతే క్షణాల్లో ఘ టనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 8.45 గంటలకు ఎస్‌ఐ హరికృష్ణ చొరవతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ పూర్తి చేసి యువకుడిని కిందికి దించగలిగారు.

ఇదీ విషయం...

పొందూరు మండలంలోని కింతలి గ్రామానికి చెందిన విభూది శివకుమార్‌ (30) అనే యువ కుడు ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌కు చెందిన ఒక యువతిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాని.. ప్రేమకు అంగీకరించిన యువతి వివాహానికి నిరాకరించిందని పోలీసుల వద్ద చెప్పాడు. దీనికి కారణం వారి పెద్దలేనని.. భరించలేకే ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ ఎం.హరికృష్ణ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో చట్ట పరిధిలో ఇటువంటి వ్యవహా రం పరిష్కరించుకోవాలని సూచించారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే చట్టప్రకారం తాము న్యాయం చేస్తామని యువకుడికి హామీ ఇచ్చి రిమ్స్‌కు పంపించారు.

నేటి నుంచి జాతీయ ఆహార భద్రతా కమిషన్‌ పర్యటన 1
1/2

నేటి నుంచి జాతీయ ఆహార భద్రతా కమిషన్‌ పర్యటన

నేటి నుంచి జాతీయ ఆహార భద్రతా కమిషన్‌ పర్యటన 2
2/2

నేటి నుంచి జాతీయ ఆహార భద్రతా కమిషన్‌ పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement