వృక్ష సంపదే జీవరాశి మనుగడకు మూలాధారం | - | Sakshi
Sakshi News home page

వృక్ష సంపదే జీవరాశి మనుగడకు మూలాధారం

Sep 2 2025 7:38 AM | Updated on Sep 2 2025 7:38 AM

వృక్ష సంపదే జీవరాశి మనుగడకు మూలాధారం

వృక్ష సంపదే జీవరాశి మనుగడకు మూలాధారం

వృక్ష సంపదే జీవరాశి మనుగడకు మూలాధారం

జయపురం: వృక్ష సంపదే జీవరాశి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు మూలాధారమని జయపురం రోటరీ క్లబ్‌ కరస్పాండెంట్‌ నిశాన్‌ పట్నాయక్‌ అన్నారు. సోమవారం జయపురం రోటరీ క్లబ్‌, విక్ర మదేవ్‌ విశ్వ విద్యాలయ ఎన్‌.సి.సి కేడర్‌ సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జయపురం విశ్వవిద్యాలయ ప్రాంగణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100కు పైగా వివిధ రకాల మొక్కలను నాటినట్లు జయపురం రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు ఆర్‌.టి.ఎన్‌.అమర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ కార్యదర్శి నారస్‌ నిశంఖ, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, సీనియర్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement