జయపురం: కుండపోత వర్షాలకు జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి దొండాబడి పంచా యతీ పనసపుట్ గ్రామ సమీప రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోయిన విషయం పాఠకులకు విదితమే. దొండాబడి– చికాపూర్ మధ్య గల కల్వర్టు కొట్టుకుపోవటం వలన ఆ పంచాయతీలో 25 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దొండాబడి పంచా యతీ సర్పంచ్ చెండియ ఖిలో ఈ విషయాన్ని అధికారు దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీ ప్రజల ఇబ్బందులను వివరించి, వెంటనే కల్వర్టును బాగు చేయాలని కోరారు. అధికారులు పట్టంచుకోలేదు. సర్పంచ్ తన సొంత డబ్బుతో కల్వర్ట్‌ను బాగు చేసేందుకు నడుం బిగించారు. ప్రధాన మంత్రి గ్రామ షడక్ యోజనలో మూడేళ్ల కిందట నిర్మించిన కల్వర్టు గతంలో వర్షాలకు రెండు పర్యాయాలు కూలిపోయింది. అధికారులు పట్టించుకోకపోవటంతో ఆ రెండు సార్లు సర్పంచ్ ఖిళో తన సొంత డబ్బు తో బాగు చేయించారని ప్రజలు తెలిపారు. నేడు కూడా వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టును సొంత డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేయిస్తున్నారు. సర్పంచ్‌కు పంచాయతీలోని 9వ వార్డు మెంబర్ అభి గౌడ సహకరిస్తున్నారు.