
స్వాతంత్య్ర సమరంలో అవిభక్త కొరాపుట్‌పై చర్చ
జయపురం: దేశ స్వాతంత్య్ర సమరంలో అవిభక్త కొరాపుట్ భూమికపై జయపురం పూజ్య పూజా సంసద్ విభాగం ఆధ్వర్యంలో మాసిక సాహితీ సమావే శం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో కొరాపుట్ భూమికపై సాహితీ ప్రియులు చర్చించారు. పూజ్య పూజా సంసద్ ఉపాధ్యక్షులు తపనకిరణ త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన చర్చా వేదికకు సాహితీవేత్త, జయపురం సాహిత్య పరిషత్ మాజీ అధ్యక్షులు హరిహర కరసు ధా పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కవియిత్రులు భావచంద్రికా దేవి, అనంత బిజయ ధీవర్ అతిథులుగా పాల్గొన్నారు. అనసూయ సామంతరాయ్, ప్రమోద్ కుమార్ రౌళో, జానకీ పాణిగ్రహి, భగవాన్ సాబత్, నారాయణ సాగర్, ఝున్ను పండ, సంధ్యా రాణి సాహు. ప్రతీత సాహు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఎరుపెక్కిన కొరాపుట్‌లో స్వాతంత్య్ర యోధుల భూమికపై కవితలు వినిపించారు. అనంతరం పూజ్యపూజా సంసద్ అధ్యక్షులు ఉదయ శంఖర జాని ఆధ్వర్యంలో కవితా పఠన కార్యక్రమంలో పలువురు ఔత్సాహిక రచయితలు స్వాతంత్య్ర పోరాటంలో అవిభక్త కొరాపుట్ లో జరిగిన ఘట్టాలపై తమతమ స్వీయ రచనలను చదివి వినిపించారు. కవితలను పూజ్యపూజ సంసద్ సాధారణ కార్యదర్శి బైరాగీ చరణ సాహు సమీక్షించారు. సంసద సహాయ కార్యదర్శి మృత్యంజయ సాహు ధన్యవాదాలు తెలియజేశారు.