
సీఎంను కలిసిన శ్రీ మందిరం కొత్త పాలక మండలి సభ్యులు
భువనేశ్వర్:
పూరీ శ్రీ జగన్నాథ ఆలయం కొత్త పాలక మండలి సభ్యుల బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో లోక్ సేవా భవన్‌లో సోమవారం భేటీ అయింది. పూరీని దేశంలోనే అత్యుత్తమ మతపరమైన, పర్యాటక కేంద్రంగా పూరీ శ్రీ క్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. శ్రీ జగన్నాథుని సేవలు, శ్రీ మందిరం బహుముఖాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతును అందిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి అభయం ఇచ్చారు. శ్రీ క్షేత్రానికి విచ్చేసే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల కోసం పూరీ నగరంలో అనేక సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. శ్రీ మందిరంలో నిత్య దైనందిన సేవాదులతో ఉత్సవాలు, పండగ పబ్బాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆలయ విఽధివిదానాలు, ఉత్సవాల నిర్వహణ క్రమబద్ధీకరణతో పూరీ పట్టణ ప్రాంతదం అభివృద్ధిని వేగవంతం చేయడంపై పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పాలక మండలి సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శ్రీ మందిరం కొత్త పాలక మండలి నుంచి కృష్ణచంద్ర సామంతరాయ (సువార్‌వర్గం ప్రతినిథి), రఘుబీర్ దాస్ (మఠాధీష్), రామనారాయణ గొచ్ఛికర్ (ప్రతిహారి నియోగ్), మధుసూదన్ సింఘారి (పుష్పాలక్ నియోగ్), జగన్నాథ్ పూజాపండాతో కూడిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసింది.