
పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ట్యాంకర్
రాయగడ: పికప్ వ్యాన్‌ను ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో వ్యాన్ డ్రైవర్‌తో సహా రెండు పశువులు మృతి చెందిన ఘటన జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల బొడొమంజూరికుపా సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన పికప్ వ్యాన్ డ్రైవర్‌ను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా ప్రశాంతిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన చందాక పవన్ కుమార్ (29)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. పశువుల లోడుతో పికప్ వ్యాన్ జిల్లాలోని అంబొదల నుంచి మునిగుడ వైపు వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి పికప్ వ్యాన్‌ను ఢీకొంది. ప్రమాదం అనంతరం ట్యాంకర్ డ్రైవర్, హెల్పర్లు పరారైనట్లు సమాచారం.

పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ట్యాంకర్