
అదుపుతప్పి.. ఇంట్లోకి దూసుకుపొయి..
● ఇద్దరికి గాయాలు
రాయగడ: జిల్లాలోని టికిరి పోలీస్‌స్టేషన్ పరిధి సనోమట్టికొన గ్రామంలో కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకుపొయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ఒకరు గాయపడ్డారు. చంద్రమణి నాయక్ అనే మహిళ ఇల్లు దెబ్బతింది. సమాచారం తెలుసుకున్న టికిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని ప్రమాదంలో గాయపడిన వారిని టికిరిలోని ఉషాపాడు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి కంసారిగుడ నుంచి టికిరికి వస్తున్న కారు అదుపుతప్పి ఇంటిలొకి దూసుకుపొవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిని నష్టపోయిన బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కారు డ్రైవర్, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆఫ్ఘన్ మృతులకు గవర్నర్ సంతాపం
భువనేశ్వర్: ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన వినాశకరమైన భూకంపం తీవ్ర విషాదకరం. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సంతాపం ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.