
సెప్టెంబరు 5న మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి రాక
పర్లాకిమిడి: మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి సెప్టెంబరు 5న గజపతి జిల్లాలో పర్యటించనున్నట్టు డీసీసీ అధ్యక్షులు, మోహన నియోజకవర్గం ఎమ్మెల్యే దాశరథి గోమాంగో విలేకరులకు తెలియజే శారు. గజపతి జిల్లాలో శ్రీయాన్ అభియాన్ కార్యక్రమం పర్లాకిమిడి నుంచి ప్రారంభం కానుంది. దీనికి ఏఐసీసీ తరఫున సీడబ్ల్యూసీ సభ్యులు మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డిని అఖిల భారత కాంగ్రెస్‌కమిటీ ఒడిశా పపర్యవేక్షకునిగా నియమించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున చిన్నయి బెహరా, శ్రీకృష్ణచంద్ర పతి, నిరుపమా పాత్రోలను గజపతి జిల్లా కాంగ్రెస్ పర్యవేక్షకులుగా నియమించారని తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పీడబ్ల్యూడీ బంగళాలో డీసీసీ అధ్యక్షులు దాశరథి గోమాంగో ఆధ్వర్యంలో ముందస్తు సమావేశాన్ని జరిపారు. ఈ సమావేశంలో గజపతి జిల్లాలో రెండు నియోజికవర్గాలు పర్లాకిమిడి, మోహన నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మాజీ వైస్ చైర్మన్ సంజయ్ కుమార్ అధికారి, మహిళా నేత్రి జాస్మిన్ షేక్, సంతు రోథో తదితరులు పాల్గొన్నారు.