
గణేష్ మండపాల సందర్శన
పర్లాకిమిడి: గుసాని సమితిలోని సర్దాపురం, గురండి, జాజిపురం గ్రామాల్లో నెలకొల్పిన వినాయక చవితి పెండాళ్లను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, పలువురు సర్పంచులు, సమితి సభ్యులు ఉన్నారు.
‘అత్యాచారాలు అరికట్టాలి’
జయపురం: దేశంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కలవరపరుస్తున్నాయని నారీ నిర్జాతన విరోధి నాగరిక కమిటీ కన్వీనర్ ఇంద్రాణీ దాస్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివారం స్థానిక సరోజినీ భవనంలో నారీ నిర్జాతన విరోధీ నాగరిక కమిటీ నిర్వహించిన కన్వెన్షన్‌లో ఆమె వక్తగా పాల్గొన్నారు. ఒడిశాలో రోజూ 180కిపైగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, అత్యాచారాలు నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కోల్‌కతాలో పీజీ చేస్తున్న డాక్టర్‌ను హత్య చేశారని, ఉత్తరప్రదేశ్‌లో 19 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని, ఉన్నావో వద్ద మైనర్‌ను హత్య చేశారని తెలిపారు. అవిభక్త కొరాపుట్ జిల్లా జయపురంలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఈ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుందని, మల్కన్‌గిరిలోనూ సామూహిక లైంగిక దాడి జరిగిందని తెలిపారు. ప్రజలు వీటిపై చైతన్యం పెంచుకోవాలని సూచించారు.
బీహారీ మద్యం తయారీ
కేంద్రంపై గిరిజనుల దాడి
కొరాపుట్: బీహారీ మద్యం తయారీ కేంద్రంపై గిరిజనులు సామూహికంగా దాడి చేశారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి వంతెబెడ గ్రామ పంచాయతీ నువాపెడ గ్రామానికి చెందిన స్థానికులు ఈ దాడిలో పాల్గొన్నారు. ప్రభుత్వ అనుమతితో ఉన్న ఈ సారా తయారీ కేంద్రం వద్ద గిరిజనులు మ ద్యంకు బానిసలైపోతున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని ఎత్తివేయాలని అధికారులను కోరినా పట్టించుకోలేదన్నారు. దీంతో మూకుమ్మడిగా దాడి చేసి ధ్వంసం చేశారు. ఆలస్యంగా చేరుకున్న చందాహండి పోలీసులు గిరిజనులకు నచ్చజెప్పి అక్కడి నుండి తరలించారు.
కార్పొరేషన్‌గా
ప్రకటించాలని డిమాండ్
జయపురం: జయపురం మున్సిపాలిటీని కార్పొరేషన్ (మహానగర్)గా ప్రకటించాలని జయపురం మున్పిపల్ మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. స్వయం పాలన దినోత్సవం సందర్భంగా కమిటీని ఏర్పాటు చేశారు. పట్టణంలోని పెద్దలతోపాటు మాజీ కౌన్సిలర్లు ఆదివారం సమావేశమయ్యారు. మహానగరంగా ప్రకటించాలని తీర్మానించారు. జయపురం పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కార్పొరేషన్‌గా ప్రకటించకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి రబినారాయణ నందో, మాజీ కౌన్సిలర్లు బాలా రాయ్, బినోద్ మహాపాత్రో, డాక్టర్ సురేష్ దాస్, మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్, మాజీ చైర్మన్ ఆర్.పద్మ, మాజీ వైస్ చైర్మన్లు దుర్గా ప్రసాద్ శర్మ, వి.ప్రసాద రావు, మాజీ కౌన్సిలర్లు శశి పట్నాయక్, ఎ.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

గణేష్ మండపాల సందర్శన

గణేష్ మండపాల సందర్శన

గణేష్ మండపాల సందర్శన