
కాశీనగర్‌లో ప్రాజెక్టుల రూపకల్పన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని కాశీనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద స్థానిక సంస్థల స్వపరిపాలన దినోత్సవాన్ని ఆదివారం వైభవంగా ని ర్వహించారు. చైర్మన్ మేడిబోయిన సుధారాణి జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాశీనగర్ నగరపాలక సంస్థలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూపకల్పన చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్‌ఏసీ చైర్మన్ సుధారాణిని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సత్కరించారు. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, సబ్‌కలెక్టర్ అనుప్ పండా, వైస్ చైర్మన్ రఘురాం సాహు, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ, కాశీనగర్ ఎన్‌ఏసీఈవో భాగవత్ సాహు, తహసీల్దార్ సుధీర్ నందో, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

కాశీనగర్‌లో ప్రాజెక్టుల రూపకల్పన

కాశీనగర్‌లో ప్రాజెక్టుల రూపకల్పన