
పాత్రికేయుని ఇంటిలో చోరీ
రాయగడ: స్థానిక గౌతం నగర్ రెండో వీధిలో నివసిస్తున్న పాత్రికేయుడు ఇప్పిలి సర్వేశ్వరరావు ఇంటిలో దొంగతనం జరిగింది. శనివారం రాత్రి ఇంటిలో అంతా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇంటి వెనుక నుంచి చొరబడిన దుండగుడు ఇంటిలో గల గదుల్లో నిద్రిస్తున్న వారి తలుపులకు గడియ పెట్టి అనంతరం పూజా గదిలోకి ప్రవేశించి అక్కడ గల వెండి పూజా సామగ్రితో పాటు ఇత్తడి వస్తువులు దొంగిలించాడు. తెల్లవారి లేచి చూసేసరికి గది తలుపు బయట నుండి గడియపెట్టి ఉండటంతో మిత్రునికి ఫోన్ చేసి తలుపు తెరిపించాడు. పూజా గదిలోకి వెళ్లి చూడగా సామాన్లు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి ఆదివారం చేరుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో గల ఒక ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దుండగుడిని గుర్తించారు.

పాత్రికేయుని ఇంటిలో చోరీ