
బీజేడీ యువ నాయకుడు రాజు మృతి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా ప్రతిపక్ష బీజేడి యువ విభాగ పట్టణ కార్యదర్శి ఆనాల రాజు (పురుషోత్తం) (24) అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజును మెరుగైన వైద్య చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి వెళ్లారు. చికిత్సపొందుతూ ఆదివారం చనిపోయారు. రాజు మృతిపై రాజ్యసభ సభ్యుడు మున్నా ఖాన్, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, జెడ్పీ ప్రెసిడెంట్ మొతిరాం నాయక్, మాజీ ఎంపీలు రమేష్ మజ్జి, ప్రదిప్ మజ్జి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, బీజేడీ నాయకుడు తపస్ త్రిపాఠి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.