
అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
● జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి
జయపురం: జయపురం పట్టణ అభివృద్ధికి, పారిశుద్ధ్య నిర్వహణకు కౌన్సిల్ కట్టుబడి ఉందని మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి స్పష్టం చేశారు. ఆదివారం స్వయం పాలన దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చడంలో ప్రజలు సహకరించాలని కోరారు. తమ కౌన్సిల్ వచ్చిన తరువాత అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, మరికొన్ని పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వైస్ చైర్మన్ బి.సునీత, కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్ పాల్గొన్నారు. ఇంజినీర్ చైతన్య బక్షీ, ప్రతాప్ కుమార్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తమ పారిశుద్ధ్య శ్రామికులు, ఇతర ఉద్యోగులకు వస్త్రాలు, బహుమతులు అందించి సన్మానించారు. జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మేఘమల్లి తోట ఉద్యాన వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గోశాలలను ప్రారంభించారు. జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, కార్యనిర్వాహక అధికారి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి