
గంట్యాడ: ఆగిఉన్న రెండు లారీలను ఓ టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాల య్యాయి. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంట్యాడ మండలంలోని రామవరం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రెండు లారీలు ఆగి ఉన్నాయి. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గులోడుతో బొబ్బిలి వెళ్తున్న టిప్పర్ ఆగిఉన్న ఆ రెండులారీలను బలంగా ఢీకొట్టడంతో ఒకలారీ కిందికి బోల్తాపడింది. దానిముందు ఉన్న లారీని ఢీకొట్టడంతో టిప్పర్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. దీంతో క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్ సహాయంతో అతన్ని బయటకు తీశారు. అయితే అప్పటికే క్లీనర్ కోన వెంకటరమణ మృతి చెందాడు. ఈ ఘటనలో డ్రైవర్ గాయాలపాలయ్యాడు. మృతుడిది అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ పంచాయతీ పరిధిలోని గొల్లలపాలెం గ్రామం. మృతుడికి భార్య భవాని, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం క్రైమ్: కోరుకొండ అలమండ రైల్వే స్టేషన్ ల మధ్య రైలు పట్టాల పై గుర్తుతెలియని మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది ఆదివారం కనుగొన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 మధ్య ఉంటుందని సమారు 5 అడుగుల 5 అంగుళాల పొడవుతో ఛామనఛాయ రంగు కలిగి నలుపు రంగు, చిన్న,చిన్న తెలుపురంగు పవ్వుల గల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నీలం రంగు షార్ట్ ధరించి ఉన్నాడని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 919490617089, 6301365605 నంబర్లకు కానీ ల్యాండ్‌లైన్ నంబర్ 08912883218కు కానీ ఫోన్ చేసి చెప్పాలని కోరారు.
క్లీనర్ మృతి, డ్రైవర్‌కు గాయాలు