
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
రాయగడ: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ మాధవ సొబొరొ (36) రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన జిల్లాలోని గుణుపూర్‌లో ఘ టన చోటు చేసుకుంది. గుణుపూర్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా విద్యుత్ స్తంభాన్ని బైకుతో ఢీకొనడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు గుణుపూర్ సబ్ డివిజన్ హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా బైపాస్ రోడ్డు పనులు ఎక్కడబడితే అక్కడే గుంతలు చేసి పనులు నత్తనడకన కొనసాగిస్తుండడంతో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో గుణుపూర్ ఆదర్శ పోలీస్‌స్టేషన్ ఐఐసీ కేకేబీకే కుహరో సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి