
● హోంగార్డు సాహసం
కొరాపుట్: హోంగార్డు ధైర్య సాహసంతో పెద్ద అగ్ని ప్రమాదం తప్పింది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం మెయిన్ రోడ్డులోని మా బండారు ఘరణి శక్తి పీఠం వెనక రోడ్డులో పూజా హోటల్‌లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గమనించిన హోటల్‌లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. వంట గది నుంచి మంటలు ఎగబడి మెదటి అంతస్తుకి పాకాయి. మెదటి అంతస్తులోని గదిలో గ్యాస్ సిలెండర్లు ఉన్నాయని సిబ్బంది కేకలు వేశారు. దాంతో స్థానికులు కూడా భయపడి ఆ ప్రాంతానికి దూరంగా వెళ్లిపోయారు. ఇది గమనించిన ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న హోం గార్డు ఎ.మహేష్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. అంతలో అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అప్పటికే సిలెండర్లు ఉన్న గదికి మంటలు అంటుకున్నాయి. దీంతో మహేష్ తన ప్రాణాలు లెక్క చేయకుండా గది తలుపులు తీసి అగ్ని మాపక సిబ్బందిని లోపలకు తీసుకెళ్లి సిలిండర్ల వరకు మంటలు వ్యాపించకుండా చేశాడు. ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రమాదం తప్పించిన మహేష్‌ని జిల్లా వాసులు అభినందనలతో ముంచెత్తారు.

● హోంగార్డు సాహసం

● హోంగార్డు సాహసం