
● కొట్టుకుపోయిన కల్వర్టు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో కుండపోత వర్షాలకు ఒక కల్వర్టు కొట్టుకు పోయింది. సమితిలో 25 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వారు కొట్టుకుపోయిన కల్వర్టు ప్రాంతంలో కొన్ని ఇనుప పైపులను వేసి వాటిపై వెళ్తున్నారు. ఆ కల్వర్టు మూడేళ్ల కిందట బొయిపరిగుడ సమితి దండాబడి నుండి చికాపూర్ వరకు ప్రధాన మంత్రి షడక్ పథకంలో వేశారు. అయితే గత కొద్ది దినాలుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు పడటంతో కల్వర్టు కొట్టుకుపోయిందని ప్రజలు తెలిపారు. నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల కల్వర్టు కొట్టుకుపోయిందన్నారు. ఈ విషయం దొండాబడి సర్పంచ్ చెండియ ఖిళో దృష్టికి కొంత మంది జర్నలిస్టులు తీసుకువెళ్లగా గతంలో రెండు సార్లు కల్వర్టు డ్యామేజ్ అయిందని, తాను సొంత డబ్బుతో మరమ్మతు చేయించానని వెల్లడించారు. అనేక సార్లు ఆర్‌డీ అధికారులకు తెలిపినా పట్టించుకోవటం లేదని వెల్లడించారు.