
జర్నలిస్ట్‌పై హత్యాయత్నం
కొరాపుట్: మద్యం మత్తులో జర్నలిస్ట్‌పై హత్యాయత్నం జరిగింది. శనివారం వేకువజామున నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రంలో ఒక టీవీ చానల్ జిల్లా ప్రతినిధి సుమిత్ కుమార్ గంటోపై అదే గ్రామానికి చెందిన హరేకృష్ణ బెహరా కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రాణ భయంతో సుమిత్ పరుగులు తీశాడు. ఇది చూసిన స్థానికులు నిందితుడు హరేకృష్ణను బంధించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సుమిత్‌ను పపడాహండి సమితి కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. శరీరం లోపల రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. మరోవైపు స్థానికుల దాడితో నిందితుడు హరేకృష్ణ తీవ్రంగా గాయపడడంతో పోలీసులు అతడిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. నిందితుడు గత కొద్దిరోజులుగా మతిస్థిమితం లేకుండా మద్యం మత్తులో గొడవలకు దిగుతున్నాడని స్థానికులు పేర్కొన్నారు.

జర్నలిస్ట్‌పై హత్యాయత్నం