
కాశీనగర్‌లో న్యాయ చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: కాశీనగర్‌లో వారణాసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ ఆధ్వర్యంలో దైనందిన చట్టాలు, వాటి అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా కోర్టు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి బిమల్ రవుళో ప్రారంభించగా, బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది గుమ్ముడు చిట్టిబాబు, అసిస్టెంటు బ్లాక్ విద్యాధికారి నర్మదా దాస్, వారణాసి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్.దిలీప్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. విద్యార్థులకు చట్టాలు, వాటి అమలు, యుక్త వయస్సు వచ్చిన విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యలు, సమాజంలో చట్టాలు వాటి పరిధిని కూలంకషంగా వివరించారు.