రైతులకు ఎరువులు అందడం లేదు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఎరువులు అందడం లేదు

Aug 31 2025 1:18 AM | Updated on Aug 31 2025 1:18 AM

రైతుల

రైతులకు ఎరువులు అందడం లేదు

రైతులకు ఎరువులు అందడం లేదు గంబూషియాతో దోమల లార్వాకు చెక్‌ ● చంద్రబాబు, పవన్‌ డ్రామాలు కట్టిపెట్టాలి ● స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటు పరం కాకుండా చూడాలి ● వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

సోంపేట: మండలంలో రైతులకు సకాలంలో రసాయన ఎరువులు అందడం లేదని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. వ్యవసాయ సహాయ సంచాలకులు భవానీ శంకరరావు, వ్యవసాయాధికారి బి.నర్సింహమూర్తితో మండల పరిషత్‌ కార్యాలయంలో శనివా రం సమీక్ష నిర్వహించారు. మండలంలోని రైతులకు ఎరువులు అందడం లేదని సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు చెబుతున్నారని పేర్కొన్నా రు. అఽధికారులు స్పందించి ఎరువులు అందజేయాలని కోరారు. వ్యవసాయాధికారులు మా ట్లాడుతూ ఎరువులు వచ్చే వారంలో మండలానికి అవసరమైనంత చేరుకుంటాయని తెలియజేశారు. ఎంపీపీ డాక్టర్‌ నిమ్మన దాస్‌ తదితరులు ఉన్నారు.

అరసవల్లి: జిల్లాలో దోమల వ్యాప్తి నియంత్రణలో భాగంగా నీటితో నిండిన చెరువుల్లో దోమల ఉత్పత్తి కేంద్రాలైన లార్వాలను తినేసే గంబూషియా చేపలను విడిచిపెట్టనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఆయన శనివారం ఉదయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఇంద్ర పుష్కరిణిలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.అనితతో కలిసి గంబూషియా చేపలను విడిచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షల గంబూషియా చేపలను సిద్ధం చేశామని, జిల్లాలో మొత్తం 165 టీమ్‌లతో అన్ని చెరువుల్లోనూ వీటిని విడిచిపెట్టేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కెఎన్‌వీడీవీ ప్రసాద్‌, డీఎంహెచ్‌ఓ అనిత, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి పీవీ సత్యనారాయణ, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుధీర్‌, అరసవల్లి యూపీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ బి.సాయిదివ్య తదితరులు ఉన్నారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ముమ్మరం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో గల 6,51,717 పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్తగా క్యూ ఆర్‌ కోడ్‌ ఆధారిత రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభమైందని, ఈ పంపిణీ సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. సంబంధిత కార్డుదారులు తమ రేషన్‌ షాప్‌ పరిధిలోని సచివాలయ సిబ్బంది లేదా రేషన్‌ డీలర్‌ ద్వారా బయోమెట్రిక్‌ విధానంలో కార్డు లు తీసుకోవాలని సూచించారు. ఈ–కేవైసీ చే యించుకోకుంటే ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. అలాగే వాణిజ్య అవసరాలకు తప్పనిసరిగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లను మాత్రమే వాడాలని సూచించారు.

రుషికొండపై చేసిన

విమర్శలు గుర్తున్నాయా..?

నరసన్నపేట:

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి నాయకులు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, విశాఖ వచ్చిన కూటమి నాయకులు మరోసారి దీన్ని రుజువు చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విభాగాలుగా విభజించి ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీనిపై కూటమి నాయకులు స్పందించలేదని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌పై ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన నాయకులు ఇప్పుడు పెదవి విప్పాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ఒకే విధానంపై ఉందని గుర్తు చేశా రు. ఆనాడే అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశామన్నారు. విశాఖ ప్రజలు కూటమి నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రుషికొండ భవనాలపై విషం కక్కిన నాయకులు ఇప్పుడు వాటిని వాడుకోవడానికి పోటీ పడుతున్నారని తెలిపారు. అప్పట్లో జగన్‌ ప్యాలెస్‌ అంటూ దుష్ప్రచారం చేసి, ఇప్పుడు భవనాల వద్ద ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. జగన్‌ ప్యాలెస్‌ అన్న నాయకులు జీఓలో ఎందుకు అలా పెట్టలేదని ప్రశ్నించారు.

రైతులకు ఎరువులు అందడం లేదు 1
1/1

రైతులకు ఎరువులు అందడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement