
20 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేత
పర్లాకిమిడి: హైటెక్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి మణిపూర్ రాష్ట్రం తోబాల్ జిల్లాలో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 20 మంది ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందజేశారు. 2025–26 విద్యా సంవంత్సరంలో 50 మెడికల్ సీట్లు ప్రభుత్వ ఆదేశాలతో పెంచి ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలియజేశారు. అనంతరం రెండు రోజుల పాటు మణిపూర్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంబించి అనేక మంది రోగులకు ప్రాథమిక చికిత్స అందజేశారు. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కూడా పాల్గొన్నారు. మణిపూర్ గ్రామస్థులు అక్కడ పండిస్తున్న వివిధ రకాల పండ్లు, మొక్కలను హైటెక్ చైర్మన్ తిరుపతి పాణిగ్రాహికి అందజేశారు. విద్యాసంస్థల డైరెక్టర్లు రాకేష్ పాణిగ్రాహి, ధృత్తిమోక్ష పాణిగ్రాహిలు ఉన్నారు.