రాయగడ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక సద్భావన స్పొర్ట్స్ కాంప్లెక్స్ నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణి జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులకు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాల గురించి ఈ సందర్భంగా వివరించారు. క్రీడల్లొ రాణించాలని క్రీడాకారులనేద్దేశించి మాట్లాడారు. ర్యాలీలో క్రీడాకారులు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక జీసీడీ వాకర్స్ క్లబ్ సభ్యులతో సమావేశమైన కలెక్టర్ ఆరోగ్యానికి నడక ఎంతో అవసరమన్నారు. దీనిని ఈ క్లబ్ సభ్యులు వివిధ సందర్భాల్లో నడక గురించి చేపడుతున్న చైతన్య, అవగాహన కార్యక్రమాలను ప్రశంసించారు. క్లబ్ అధ్యక్షులు చిన్నారి విజయమోహన్, సభ్యులు కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.